గత్యంతరం లేని గతం తరుముతుంటే
ప్రపంచంతో ప్రస్తుతాన్ని గడపలేక
భారమైన భవిష్యత్తును భరించలేమోనని
తనకుతాను చేసుకునే నాలుగు అక్షరాల ఆవేశ పూరిత ఆత్మవంచనే "ఆత్మహత్య" !!!




ఆశయం కూడ ఆశతోనే మొదలౌతుంది  
గతం లేనిదే స్వగతం ఎముంటుంది
అర్దం కాకుంటేనే  ఆలోచన అంకురిస్తుంది
సాధన నీ స్వాశైతే సాధించలేనిదేముంటుంది !!!  

ఎందుకు అసలెందుకు సిగ్గులేని నీజన్మెందుకు !
బ్రతికేందుకు పెరిగేందుకు సామాన్యుల బలిఎందుకు
పదవుల మోజెందుకు పగ్గాలకై పరుగులెందుకు

ఎందుకు అసలెందుకు నీచమైన నీజన్మెందుకు !
మతాల మాటెందుకు ప్రాంతాల పాలనెందుకు
తినేందుకు వుండేందుకు వందల కోట్ల ఆస్తులెందుకు

సిద్దం కండి ఏకం కండి !!
రాజకీయ రాబందులను వెంటాడి వెటాడేందుకు
నోటు రాజకీయాలని తొక్కి నలిపేందుకు
సిద్దం కండి ఏకం కండి !!


కొన్ని రోజుల క్రితం ఒక అందమైన కల !! అందులో ఇంకా అందమైన అమ్మాయి... తన పేరు "పూజ" !!! తన కోసం నేను రాసుకున్న పిచ్చి రాతలే ఇవి...



కాకినాడలో ఫేమస్ కాజ.. నా కలల ఫేవరైట్ పూజ,
నీటిని దాచి వుంచేది కూజ.. నా మదిని దోచిన చిన్నది పూజ,
మామిడి పళ్ళ రసం మాజ.. మనసు మెచ్చిన వరం పూజ,
అన్నిటికన్న అందమైన ఫ్లవర్ రోజ, అమ్మాయిలందరికన్న క్లవర్ పూజ,

పూజ - నీ కొసం తెరిచుంచా నా దిల్ కా దర్వాజా,
నువ్వు ఊ అంటే త్వరలోనే మోగిస్తా మన పెల్లికి భాజా...

ఎవరో నీవెవరో !!!
గగనమున నీలి మేఘాల అల్లికవో
భువనమున పరిమళ పుష్పాల మాలికవో
సప్తస్వర రాగాల అలికిడివో
సప్తవర్ణ అందాల హరివిల్లువో
ఎవరో నీవెవరో !!!

क्या समजू तेरी कामोशी को !
कैसे समजावू मेरा मन को !!
क्या बोलू जो पल तेरे साथ !
कैसे निबावु जो वादे तेरे बिना !!
రైతన్నల నోటి పిలుపులు కావవి ఆకలి కేకలవి
నీటమునిగిన పంటలు మాత్రమే కావవి నిండా మునిగిన జీవితాలవి

రైతన్నల పగటి కునుకులు కావవి ఆత్మహత్యలవి
రంగులు కూడిన నేలలు కావవి నెత్తురు ఓడిన భూములవి

అన్నం పెట్టే చేతులకు చివరకి మిగిలేవి
కల్తీ ఎరువులు, ధళారుల మోసాలు, అధికారుల లంచాలు, లాఠీదెబ్బలు...