! అమ్మ !
"పాటలు ఇష్టం, పాటలోని భావం ఇష్టం, భావాన్ని కలిగిన చరణం ఇష్టం, చరణాన్ని తెలిపే రాగం ఇష్టం, రాగాన్ని పలికే స్వరం ఇష్టం, ఆ స్వరం *అమ్మ* ది ఐతె ఇంకా ఇష్టం"

"వెన్నెల ఇష్టం, పున్నమి నాడు గుండ్రటి చంద్రుడు ఇష్టం, చంద్రుడున్న నింగి ఇష్టం, నింగి లోని తారలు ఇష్టం, ఆ అద్బుతాలను చూపించేది *అమ్మ* ఐతె ఇంకా ఇష్టం"

"పాఠాలు ఇష్టం, పాఠం నేర్పే జ్ఞానం ఇష్టం, జ్ఞానం ఇచ్చే తెలివి ఇష్టం, ఇవన్ని నేర్పే బడి ఇష్టం, ఆ బడి మా *అమ్మ* వడి ఐతె ఇంకా ఇష్టం"

"కష్టం ఇష్టం, మనసు పడే వేదన ఇష్టం, బాధను బరించలేని కళ్ళు ఇష్టం, కంటి నుంచి వచ్చే కన్నీరు ఇష్టం, ఆ కన్నీటిని తుడిచె చెయ్యి *అమ్మ* ది ఐతె అన్ని ఇష్టలే"

"అమ్మ ప్రేమంటే ఇష్టం, ప్రేమించటం ఇష్టం, ఆ ప్రేమ నాకే అనుకోవటం ఇష్టం, ఆ ప్రేమకై 'నా' లో కలిగే స్వార్దం ఇష్టం, ఆ స్వార్దం *అమ్మ* ప్రేమకోసమే ఐతె అన్నీ ఇష్టాలే"

No comments: