రైతన్నల నోటి పిలుపులు కావవి ఆకలి కేకలవి
నీటమునిగిన పంటలు మాత్రమే కావవి నిండా మునిగిన జీవితాలవి

రైతన్నల పగటి కునుకులు కావవి ఆత్మహత్యలవి
రంగులు కూడిన నేలలు కావవి నెత్తురు ఓడిన భూములవి

అన్నం పెట్టే చేతులకు చివరకి మిగిలేవి
కల్తీ ఎరువులు, ధళారుల మోసాలు, అధికారుల లంచాలు, లాఠీదెబ్బలు...

No comments: